మందు పాతర పేలుడులో జవాన్‌కు గాయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో ఓ సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందజేస్తున్నట్లు సుకుమా జిల్లా ఎస్పీ డి.శ్రావణ్ వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం... ఈ రోజు తెల్లవారుజామున మావోయిస్టుల కోసం చింతలనార్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు కూబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన మావోయిస్టులు అప్పటికే ఆ పరిసరాల్లో అమర్చిన మందుపాతరను పేల్చివేశారు.
దాంతో సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషయాన్ని జవాన్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మావోయిస్టులు అక్కడి నుంచి పరారైయ్యారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్ర తరం చేశారు.