dactors
-
ఆర్ఎంపీలకు లైసెన్సా?
కర్నూలు(హాస్పిటల్): తాము 15 సంవత్సరాలు కష్టపడి చదివి డిగ్రీలు సంపాదిస్తున్నామని, కానీ వైద్యం చేసేందుకు ఎలాంటి అర్హత లేని ఆర్ఎంపీలకు ఎలా లైసెన్స్ ఇస్తారని సీనియర్, జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే జీవో నెం.465ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ కాలేజీలోని సీఎల్జీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆసుపత్రి ఆవరణ నుంచి మెడికల్ కాలేజీ మీదుగా రాజవిహార్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ వైద్యవిద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించి, తెలుగునాడు పార మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కలెక్టరేట్ చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా కాసేపు రాస్తా ఆందోళన చేసి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ రెండు రోజుల్లోగా తమ డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 52వేల మంది ఆర్ఎంపీల ఓట్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం వారు వైద్యం చేసేందుకు లైసెన్స్‌లు మంజూరు చేస్తోందని విమర్శించారు. వారు చేసే వైద్యంతో వేలాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. పైగా జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం లేదని తమను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల పోస్టులు కాంట్రాక్టు పద్ధతిన గాకుండా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తే గ్రామాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు జూడాలు తెలిపారు. అనంతరం జీఓ 465ను రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు వినతి పత్రం సమర్పించారు. వీరి ఆందోళనకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ రామకృష్ణనాయక్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శివశంకర్‌రెడ్డి, డాక్టర్ సి. మల్లికార్జున, కోశాధికారి డాక్టర్ రంగయ్య, జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు అనుదీప్, దీరజ్, శ్రీహరి, శివప్రసాద్, సతీష్ తదితరులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. -
వైద్యో నారాయణో హరి
4 లక్షల మంది భక్తులకు వెద్య సేవలు పక్కా ప్రణాళిక అమలు జిల్లాలో 165 వైద్య శిబిరాలు 300 మంది స్పెషాలిటీ వైద్యులు ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ విజయవాడ (లబ్బీపేట) : వేలాదిమంది భక్తుల రాకపోకలు, వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువ. ఎప్పడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. అయినా పక్కా ప్రణాళికతో వైద్య ఆరోగ్యశాఖ సేవలందించింది. ఇందుకు మూడంచెల విధానాన్ని అమలు చేసి అనారోగ్యానికి గురైన యాత్రికులకు తక్షణ వైద్య సహాయం అందించి క్రిటికల్ కేసులను సకాలంలో ప్రత్యేక పుష్కర వార్డులకు తరలించి ప్రాణనష్టం జరగకుండా చూసింది. పుష్కరాల్లో ఇప్పటివరకు 4 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. మూడంచెల వ్యవస్థ అమలు జిల్లాలో 165 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా వాటిలో 300ల మంది స్పెషాలిటీæ వైద్యులు (ఆరో్ధపెడిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా)లతో పాటు మరో 300 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వహించారు. వైద్య శిబిరంతో పాటు ఫస్ట్ లెవల్ రిఫరల్ సెంటర్, ప్రత్యేక వార్డులు ఇలా మూడంచెల వ్యవస్థను అమలు చేశారు. తొలుత వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి అనంతరం సమీపంలోని ఫస్ట్‌లెవల్ రిఫరల్ సెంటర్‌కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం అవసరమైతే ప్రభుత్వాస్పత్రిలోని ప్రత్యేక వార్డులకు తరలించారు. వందకు పైగా అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచడంతో పాటు రోగులను సకాలంలో ఆస్పత్రులకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. ఉన్నత స్థాయి పర్యవేక్షణ జిల్లాకు నోడల్ ఆఫీసర్‌గా డీఎంహెచ్ఓ డాక్టర్ ఆర్. నాగమల్లేశ్వరి వ్యవహరించగా పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి ఉన్నత స్థాయి అధికారులందరూ నగరంలోనే మోహరించి సేవలను పర్యవేక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌లతో పాటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి, స్పెషలాఫీసర్‌గా నియమితులైన పారా మెడికల్ బోర్డు కార్యదర్శి డాక్టర్ టి. వేణుగోపాలరావు, ఇతర అడిషినల్ డైరెక్టర్స్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. సమన్వయంతో సేవలు జిల్లాలోని వైద్యులు, సిబ్బందితో పాటు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది సిబ్బందికి విధులు కేటాయించి వారందరినీ సమన్వయ పరుస్తూ సేవలందించడంలో డీఎంహెచ్‌వో విజయం సాధించారు. ఒకవైపు సిబ్బందికి సకాలంలో భోజనాలు అందకున్నా అరటిపండ్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తూ వారు సేవలు అందించేలా కృషి చేశారు.