కొడుకు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్
తెలుగు సినిమా అంటేనే వెంటనే గుర్తుకొచ్చే పేరు దగ్గుబాటి రామానాయుడు.. ఆయన స్థాపించిన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. తన కుమారులు ఇద్దరు సురేష్ బాబు, వెంకటేశ్‌ల ఫొటోలతోనే ఆయన సురేష్ ప్రొడక్షన్స్ లోగో ఉంటుంది. పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరుమీదనే ఈ సంస్థను ప్రారంభించారు. 1963లో అనురాగం సినిమాతో ఆయన సినీ నిర్మాణ ప్రస్థానం ప్రారంభమైంది.
దాదాపు ఆయన నిర్మించిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సన్నివేశంలో రామానాయుడు కనిపించడం సర్వసాధారణం. ప్రేక్షకులు కూడా ఆయన పాత్రలను ఆదరిస్తూ వచ్చారు. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడ సహా భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ ఆయన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మించారు.