Daily Star
-
48 ఏళ్లలో 17, 532 మొక్కలు
అబ్దుల్ సమద్ షేక్.. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ 60 ఏళ్ల వృద్ధుడికి మరో పేరు కూడా ఉందండోయ్! అందరూ ఇతడిని ముద్దుగా ‘ట్రీ సమద్’ అని పిలుస్తున్నారు. సమద్కున్న ఓ అలవాటు వల్ల ఈ పేరు వచ్చింది. అదే గత 48 ఏళ్లుగా ప్రతిరోజూ ఒక మొక్కను నాటడం! ఇతని స్వస్థలం బంగ్లాదేశ్‌లోని ఫరీద్పూర్. రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజుకి సుమారుగా రూ. 80 సంపాదిస్తుంటాడు. తాను సంపాదించిన ఆదాయంలో నుంచే ఫరీదా పూర్ హార్టికల్చర్ సెంటర్లో రోజూ ఒక మొక్కను కొని నాటుతూ వస్తున్నాడు. ఇతడికి సొంత ఇల్లు కూడా లేదు. ఫరీద్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫీసుకు చెందిన స్థలంలో రెండు రేకుల షెడ్లు వేసుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు. సమాజానికి అబ్దుల్ చేస్తున్న కృషిని గుర్తించి ది డైలీ స్టార్ అనే వార్తా సంస్థ అతడికి రూ. 80 వేల నగదు బహుమతిని అందజేసి గౌరవించింది. 48 ఏళ్లలో ఆయన మొత్తం 17,532 మొక్కలను నాటాడు. ‘నా పదకొండో ఏట నుంచే మొక్కలను నాటడం ప్రారంభించాను. ప్రభుత్వ స్థలంలోనే వాటిని నాటుతాను. దీంతో వాటిని ఎవరూ పెరికేందుకు ప్రయత్నించరు. ఎవరైనా మొక్కలు పీకితే నాకు చాలా కోపం వస్తుంది. రోజూ ఒక మొక్క అయినా నాటనిదే నాకు నిద్ర పట్టదు. నాకు ప్రాణులు, జంతువులన్నా ఇష్టమే’ అని సమద్ ప్రేమగా చెబుతున్నాడు. -
ఐసిస్ హిట్ లిస్టులో న్యూస్ ప్రజెంటర్స్
-
ఐసిస్ హిట్ లిస్టులో న్యూస్ ప్రజెంటర్స్
లండన్ : ఐఎస్ఐఎస్ హిట్ లిస్టులో ఇన్ని రోజులు ప్రముఖ నేతలు, ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రభుత్వాలకు సహకరించే వారు ఉండేవారు. కానీ తాజాగా న్యూస్ ప్రజెంటర్లను కూడా ఐసిస్ టార్గెట్ చేసింది. బీబీసీ, స్కై న్యూస్ లోని ప్రముఖ బ్రిటీష్ టెలివిజన్ జర్నలిస్టులను ఐసిస్ టార్గెట్ చేసినట్టు తెలిసింది. న్యూస్ రీడర్స్ పై అటాక్ చేయడంతో పాటు, వారి ఆఫీసు ప్రాంగణాల్లో కూడా దాడులు నిర్వహించేందుకు పన్నాగం పన్నుతుందని డైలీస్టార్ రిపోర్టు చేసింది. వారిని అలర్ట్ చేయాలని పోలీసులను తాము ఆశ్రయించామని, కౌంటర్ టెర్రరిజం అధికారులు ఈ కేసులను విచారణకు స్వీకరించినట్టు డైలీ స్టార్ పేర్కొంది. బీబీసీ, స్కై న్యూ రీడర్లను టార్గెట్ చేసినట్టు ఇస్లామిక్ స్టేట్ వెబ్ సైట్లో పేర్కొన్నారని, వారి ఆఫీసు ప్రాంగణాలని కూడా వెబ్ సైట్లో పోస్టు చేసినట్టు న్యూస్ పేపర్ వివరించింది. పర్యాటక ప్రదేశ ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించాలని టెర్రర్ బాసులు ఆదేశించినట్టు తెలిసింది. డౌనింగ్ స్ట్రీట్, బిగ్ బెన్, వెస్ట్ మిన్స్టర్ వంటి ప్రాంతాలు వారి టార్గెట్ గా ఉన్నాయట. ఐసిస్ పోస్టు చేసిన మిగతా జాబితాల్లో బ్రిటీష్ ఎంపీలు, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ భవంతులు, ఆర్మీ బేస్ లు, షాపింగ్ సెంటర్లు, ఎయిర్ పోర్టులు ఉన్నట్టు డైలీ స్టార్ రిపోర్ట్ చేసింది.