దళితులపై సీఎం ప్రేమ చూపాలి
గీసుకొండ : సీఎం కేసీఆర్ బతుకమ్మపై ప్రేమ చూపిస్తున్నట్లుగానేదళితుల సంక్షేమంపై కూడా అంతే చూపాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. బతుకమ్మ పండుగకు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అదే రీతిలోనిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. మాదిగ చైతన్య పాదయాత్ర పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర శనివారం మండలానికి చేరుకున్న సందర్బంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల కోసం రెం డు నెలలు అక్క డి ప్రజలు పోరాటం చేస్తే వారంతా సంతోషంగా ఉండాలంటూ ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిం చారన్నా రు. అదే తరహాలో తాము ఏడాదిగా వర్గీకరణ కోసం ఉద్యమిస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం లో మాదిగలు ముఖ్య భూమిక పోషించారనేది పలు జాతీ య సర్వేల్లో వెల్లడైందని,ఆ ఉద్యమం ఎలా న్యాయమైందో, డప్పు, చెప్పు ఉద్యమం కూడా అంతే న్యాయమైందన్నారు.
నవంబర్ 19 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, సీఎం కేసీఆర్ మాదిగలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు. పాదయాత్ర 21వ రోజున 840 కిలోమీటర్ల కు చేరింది. సం గెం మండలం ఊకల్ హవేలి, మరియపురం, కొనాయమాకుల, ధర్మారం మీదుగా నగరంలోకి ప్రవేశిం చింది. మధ్య లో ధర్మారం వద్ద అంబేద్కర్ విగ్రహానికి శ్రీని వాస్ మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు. పాదయాత్రలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు శిలువేరు సాంబయ్యమాదిగ, జిల్లా ఇన్చార్జి మేకల నరేందర్, ప్రధాన కార్యదర్శి సంజీవ, సహాయ కార్యదర్శి మంద బాబూరావు, ఉపాధ్యక్షులు మా దాసి రాంబాబు, రమేశ్, అర్బన్అధ్యక్షులుఆకులపెల్లి బాబు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రుక్కక్క, పరకాలని యోజకవర్గ ఇన్చార్జి మెట్‌పెల్లి కొంరన్న, రవి, యువసేన జిల్లా అధ్యక్షుడు విజయ్, దళిత ఫోరం స్టేట్ కన్వీనర్ డాక్టర్ పులి అనీల్, బుచ్చన్న, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.