బిల్లు కట్టమంటే.. ఏఈని చెప్పుతో కొట్టాడు
ముప్పాళ్ల(గుంటూరు): విద్యుత్ బిల్లు కట్టమని అడిగిన ఏఈకి చేదు అనుభవం ఎదురైంది. గత ఆరు నెలలుగా కరెంట్ బిల్లు కట్టకపోవడంతో.. అధికారులు ఓ వ్యక్తికి ఇంటి కనెక్షన్ను తొలగించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి విద్యుత్ ఏఈని చెప్పుతో కొట్టాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మలపాడులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఈ ఏడాది జనవరి నుంచి విద్యుత్ బకాయి చెల్లించలేదు.
దీంతో సిబ్బంది ఇతని ఇంటి కనెక్షన్ కట్ చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసులు గ్రామానికి వచ్చిన ఏఈ కిషోర్బాబుతో ఈ అంశంపై వాగ్వాదానికి దిగి చెప్పుతో ఆయనపై దాడి చేశాడు. ఇది గుర్తించిన సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.