ఏడేళ్లలో రూ.42 లక్షల ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దండబోయిన ఓబులేశ్‌పై సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. 2009 నుంచి 2016 వరకు రిగ్గర్ డ్రిల్లింగ్ తెలంగాణ ఇన్చార్జిగా పనిచేసిన ఓబులేశ్ కాంట్రాక్టర్లకు కొమ్ముకాయడంతో పాటు సంస్థ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కినట్టు సీబీఐ ఆరోపిస్తూ పీసీ యాక్ట్ 17, 18 కింద కేసులు నమోదు చేసింది.
ఈ ఏడేళ్లలో రూ.42.30 లక్షల ఆస్తులను కూడబెట్టినట్టు సీబీఐ గుర్తించింది. హయత్‌నగర్‌లో రూ.39 లక్షల విలువైన రెండు అంతస్తుల భవనం, రూ.8.8 లక్షల విలువైన 267 గజాల ప్లాట్, అక్కడే మరో సర్వే నంబర్లో 9లక్షల విలువైన స్థలాన్ని గుర్తించినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ ఏడేళ్లలో ఓబులేశ్ జీతాలు, సేవింగ్స్‌ను అనాలిసిస్ చేసిన అనం తరం, ఇంతటి విలువైన ఆస్తులు కూడబెట్టడం వెనుక అక్రమార్జన ఉందని సీబీఐ ఆరోపించింది.