టెన్నిస్కూ పాకిన మ్యాచ్ ఫిక్సింగ్ భూతం
టెన్నిస్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం మొదలైంది. ఇటలీ క్రీడాకారుడు డానియెల్ బ్రాసిలి ఈ విషయాన్ని విచారణలో పాక్షికంగా అంగీకరించాడు. దీంతో మరికొంతమంది టెన్నిస్ క్రీడాకారులను పోలీసులు విచారించే అవకాశం ఉంది. టెన్నిస్ మ్యాచ్లలో కొన్ని అమ్ముడుపోయాయంటూ కొన్ని వారాల క్రితం ఇటాలియన్ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. దాంతో బ్రాసిలితో పాటు అప్పుడప్పుడు అతడితో కలిసి డబుల్స్ ఆడిని పోటిటో స్టారేస్ను పోలీసులు విచారించారు.
ముందుగా వారి మధ్య సాగిన ఇంటర్నెట్ సంభాషణలను చూసిన తర్వాత ఈ విచారణ సాగింది. కేవలం వారు అడిగినవే కాక.. ఇంకా చాలా మ్యాచ్లకు సంబంధించి ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం సాగిందని పోలీసు విచారణ తర్వాత బ్రాసిలి చెప్పాడు. గతంలో డేవిస్ కప్లో ఇటలీ తరఫున డబుల్స్ ఆడిన బ్రాసిలి, స్టారేస్తో పాటు మరో ఐదుగురు క్రీడాకారులపై కూడా అక్రమంగా బెట్టింగ్ కట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో వారందరినీ నిషేధించారు.