డీఏఆర్‌లో విద్యార్థులకు.....
డీఏఆర్‌లో విద్యార్థులకు ఆటల పోటీలు
నూజివిడు :
కృష్ణా విశ్వవిద్యాలయం జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్) యువజనోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని డీఏఆర్ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి వీ స్వాములు ఆధ్వర్యంలో చిత్రలేఖనం, రంగోలి, మిమిక్రీ, మోనోయాక్షన్, క్లాసికల్‌డ్యాన్స్, సోలోసాంగ్స్, వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్ తదితర విభాగాల్లో పోటీలను నిర్వహించారు.
చిత్రలేఖనంలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఎస్ మురళీధర్(పీజీకేంద్రం,నూజివీడు), ఎల్ ఉదయ్‌కుమార్(డీఏఆర్), రంగోళీలో ఎం స్వాతి(పీజీ కేంద్రం), డీ స్వరూప(పీజీకేంద్రం), సోలోసాంగ్స్లో పీ లక్ష్మి(డీఏఆర్), ఎల్ఎన్వీ నీరజ(డీఏఆర్), క్లాసికల్ డ్యాన్స్‌లో డీ విజయలక్ష్మి(పీజీ కేంద్రం), పీ మాలాశ్రీ(డీఏఆర్), మిమిక్రీలో ఎం శరత్సూర్య(పీజీ కేంద్రం), కే సతీష్(డీఏఆర్), ఏకపాత్రాభినయంలో డీ పుల్లారావు(పీజీ కేంద్రం), వీ హరిత, వ్యాస రచనలో జీ అనూష(పీజీ కేంద్రం), ఎం వేణు(పీజీ కేంద్రం), పాటలపోటీలలో జీ శ్రీకాంత్(పీజీ కేంద్రం), కే సతీష్(డీఏఆర్)లు నిలిచారు.
ప్రథమస్థానంలో నిలిచిన వారందరికీ ఈనెల 15న మచిలీపట్నంలో నిర్వహించే కృష్ణావిశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.