రిజర్వాయర్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు
ఎల్ఎన్పేట (శ్రీకాకుళం జిల్లా) : ఇర మండలం గొట్టా బ్యారేజీ సమీపంలో నిర్మిస్తున్న వంశధార రిజర్వాయర్ పనులను దార్లపాడు గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన సుమారు 100 మంది రిజర్వాయర్ పనులు సాగుతోన్న స్థలానికి వచ్చి పనులను ఆపు చేయించారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు, మిగులు భూములు విషయం, పునరావాస సమస్య తీరే వరకు పనులు మొదలు పెట్టవద్దని కోరారు. ఆ విషయం తేలకుండా పనులు చేపడితే ఊరుకునేది లేదని గ్రామస్తులు అక్కడి అధికారులకు తెలిపారు.