ఐటీఐఆర్‌పై ప్రభుత్వ తీరు బాధాకరం
టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు బాధాకరమని, ఇది కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టని టీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన పార్టీ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్ తదితర నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఇది రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టని, 15 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, ఇంతటి కీలకమైన ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా వ్యవహరిస్తున్నాడని, పోలీసులు కేసీఆర్‌కు కాపలా కుక్కల్లా మారారని శ్రవణ్ మండిపడ్డారు.