దస్తాన్ హేమలత.. ఆవిష్కరణ
సాక్షి,ఢిల్లీ: ముప్పై ఎనిమిది భాషల్లో తన గాన మాధుర్యంతో సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని హేమలత జీవిత చరిత్రను ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ అరవింద్ యాదవ్ ‘దస్తాన్ హేమలత’ పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఆదివారం ఢిల్లీల్లో జరిగిన ‘సాహితీ ఆజ్తక్’ వేదికపై పలువురు ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు.13 ఏళ్లకే తన గాత్రంతో అందరినీ మెప్పించిన హేమలత భాష,యాసతో సంబంధం లేకుండా భారతదేశంలోని అన్ని భాషల్లో పాటలు పాడి అందరిని మెప్పించారని డాక్టర్ అరవింద్యాదవ్ పుస్తకావిష్కరణ సభలో పేర్కొన్నారు. 1970–80 దశకంలో లతా మంగేష్కర్ లేదా హేమలత పాట లేనిదే సినిమాలు లేవని చెప్పారు. హేమలత సన్నిహితులకు కూడా తెలియని అనేక విషయంలో ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చని అన్నారు.ఇదిలా ఉంటే హైదరాబాద్లో జన్మించిన హేమలత, తన బాల్యాన్ని కోల్కతాలో గడిపారు. ఆమె పాటలకు పలు జాతీయ పురస్కారాలు లభించాయి.