దావూద్ ఇబ్రహీం అనుచరుడి అరెస్ట్
ఢాకా: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో అబ్దుల్ రవూఫ్ అలియాస్ డౌద్ మర్చెంట్‌కు సంబంధాలు ఉన్నాయన్న అనుమానంపై అరెస్ట్ చేశారు.
2009లో చట్టవ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించినందుకు డౌద్ అయిదు సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. అతను జైలు నుంచి బయట అడుగుపెట్టిన వెంటనే బంగ్లాదేశ్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో సంబంధాల విషయమై బంగ్లాదేశ్ పోలీసులు డౌద్ని విచారిస్తున్నారు.
**