dcrb
-
‘పోలీస్ లెక్కలు’ మరింత పక్కాగా!
సాక్షి, హైదరాబాద్: నేరాల నియంత్రణ, నేరస్తుల కట్టడి వ్యూహాల రూపకల్పనలో నేర గణాంకాలు అత్యంత కీలకం. ప్రతి జిల్లా, పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీఆర్బీ (డిస్ట్రిక్ట్ క్రైం రికార్డ్ బ్యూరో)లు వారి పరిధిలోని నేరాల నమోదు, కేసుల దర్యాప్తు సమాచారం, ఇతర వివరాల గణాంకాలను సేకరించడంతోపాటు విశ్లేషిస్తుంటాయి. ఇకపై డీసీఆర్‌బీల సమాచారం మరింత ఉపయోగపడేలా, పక్కాగా గణాంకాల నమోదు, సమాచారాన్ని వీలైనంత వేగంగా విశ్లేషణకు పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగించుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అన్ని జిల్లాల డీసీఆర్‌బీల ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర స్థాయిలో మార్చి మొదటి వారంలో ఒక్క రోజు శిక్షణ అందించనున్నారు. స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎస్సీఆర్బీ) ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. డీసీఆర్బీ సమాచారం క్షేత్ర స్థాయిలో పనిచేసే ఇన్వెస్టిగేషన్ అధికారులతోపాటు, లా అండ్ ఆర్డర్ సిబ్బందికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచే డీసీఆర్‌బీల ఇన్స్పెక్టర్లకు రివార్డులు అందజేయనున్నట్టు డీజీపీ వెల్లడించారు. -
ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసిన పోలీస్.. ఆఖరికి
సాక్షి, నెల్లూరు: పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన డీసీఆర్బీ ఏఎస్సై శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సస్పెండ్ చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాసరావు ఇటీవల డీసీఆర్బీ వాట్సాప్ గ్రూప్‌లో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఆ గ్రూపులో ఉన్న పోలీసు అధికారులు వీటిని గుర్తించి రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేసి ఏఎస్సైను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగిని ఆదేశించారు. దీంతో మూడురోజుల క్రితం ఏఎస్సైని సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
జిల్లాలో ఇద్దరు డీఎస్పీలకు స్థానచలనం
పెదవేగి రూరల్ : డీసీఆర్బీ డీఎస్పీ జీవీఎస్ పైడేశ్వరరావు పీసీఎస్ డీఎస్పీగా, ట్రాఫిక్ డీఎస్పీ ఎం.సుధాకర్ ఏసీబీ డీఎస్పీగా బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ట్రాఫిక్ సుధాకర్ స్థానంలో గుంటూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా పనిచేస్తున్న ఎ.శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
జిల్లాలో ఇద్దరు డీఎస్పీలకు స్థానచలనం
పెదవేగి రూరల్ : డీసీఆర్బీ డీఎస్పీ జీవీఎస్ పైడేశ్వరరావు పీసీఎస్ డీఎస్పీగా, ట్రాఫిక్ డీఎస్పీ ఎం.సుధాకర్ ఏసీబీ డీఎస్పీగా బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ట్రాఫిక్ సుధాకర్ స్థానంలో గుంటూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా పనిచేస్తున్న ఎ.శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.