నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాలు
శ్రీకాకుళం : కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డీడీయూ–జీకేవై పథకం ద్వారా గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రిటైల్ రంగంలో ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. మూడు నెలల శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం సదుపాయం కలదు. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదివిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు అర్హులు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఈనెల 8వతేదీలోపు విశాఖపట్నంలోని ద్వారకానగర్ గోల్డ్ స్పాట్ బిల్డింగ్లో సంప్రదించాలి. మరిన్ని వివరాలకు 7032454555, 9985228575 నెంబర్లను సంప్రదించాలి.