అధికార సంవర్థకం
టీఆర్ఎస్ నాయకులే లబ్ధిదారులు
జాబితా గోప్యంపై అనుమానాలు
అధికారుల తీరుపై విమర్శలు
వరంగల్ : అర్హులైన పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అధికార పార్టీ వారికే బాగా అక్కరకొస్తున్నాయి. సాధారణ ప్రజల కంటే ముందే రాజకీయ నాయకులు, వారి అనుచరులు ఈ పథకాలకు లబ్ధిదారులుగా మారుతున్నారు. గ్రామీణ అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల్లో అధికార పార్టీ నాయకుల హవా నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదట అమలు చేసిన సబ్సిడీ ట్రాక్టర్లు పూర్తిగా అధికార పార్టీ వారికే దక్కా యి. పశుసంవర్థక శాఖ అమలు చేస్తోన్న సబ్సి డీ గొర్రెల పంపిణీ పథకంలోనూ ఇలాగే జరుగుతోంది. కరువు పరిస్థితుల్లో గ్రామీణ పేదలకు అసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల పథకాన్ని అమలు చేస్తోం ది. వర్షాభావంతో వ్యవసాయం నష్టాలు మిగి ల్చిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఆర్థికంగా ఆసరా నిలిచేందుకు ఈ పథకం ఉపయోగంగా ఉండనుంది. అధికారులు పారదర్శకతకు పట్టించుకోకపోవడంతో ఈ పథకం అమలులో మాత్రం ప్రభుత్వ స్ఫూర్తి నెరవేరేలా కనిపించడంలేదు.
ఒక్కో యూనిట్‌కు రూ.30 వేలు
సబ్సిడీపై పేదలకు గొర్రెలు పంపిణీ చేసే పథకం కింద జిల్లాకు 417 మినీ షీప్ యూని ట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ విలువ రూ.30 వేలు. పథకానికి ఎంపికైన లబ్ధిదారుడు రూ.15 వేలు చెల్లించాలి. మిగిలిన రూ.15 వేలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఒక్కో యూనిట్ కింద ఐదు గొర్రెలు, ఒక గొర్రెపోతును పంపిణీ చేస్తారు. లబ్ధిదారుడు తనకు నచ్చిన చోట వీటిని కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పశుసంవర్ధక శాఖకు సంబంధించి జిల్లాలో వరంగల్, జనగామ, నర్సంపేట డివిజన్లు ఉన్నాయి. 417 యూని ట్లను మూడు డివిజన్లకు సమానంగా కేటాయించారు. ఈ పథకం అమ లు కోసం జిల్లాకు రూ.62.55 లక్షలు మం జూరయ్యాయి. గొర్రెల పెంపకదారులైన పేదలు(బీపీఎల్) కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. పశుసంవర్థక శాఖ మండల అధికారి, గొర్రెల పెంపకం దారుల సొసైటీ అధ్యక్షుడు కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అధికార పార్టీ నేతల జోక్యం, అధికారుల ఉదాసీనతతో పథకం అమలులో పాదర్శకత లోపిం చింది. ప్రతి గామంలో అధికార పార్టీకి చెందిన నాయకులనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఈ జాబి తాలను మూడు డివిజన్ల పశుసంవర్ధక సహా య సంచాలకులు జిల్లా కార్యాలయానికి పంపించారు. వారం క్రితమే ఈ జాబితా ఆమో దం పొందింది. లబ్ధిదారులుగా ఎంపికైన వారి వివరాల జాబితాను పశుసంవర్ధక శాఖ అధికారులు ఎంతకీ వెల్లడించడం లేదు. లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని ‘సాక్షి ప్రతి నిధి’ పశుసంవర్థక శాఖ జిల్లా అధికారిని కోరగా.. ఆయన ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ జాబితాను పూర్తిగా రహస్యంగా పెడుతున్నారు. జాబితా ను గోప్యంగా పెడుతున్న అధికారులు అంతే గుట్టుగా పంపిణీ చేసే ఉద్దేశంతోనే పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అర్హులకు పథకం అందుతుందా... లేదా... అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిష్పక్ష పాతంగా ఎంపిక
మినీ షిప్ యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరిగింది. వారం క్రితమే కలెక్టర్ ఆమోదం కూడా తెలిపారు. అధికారికంగా రూపొందించిన జాబితా కాబట్టి వెల్లడించలేము.
- వెంకయ్య నాయుడు, పశుసంవర్థక శాఖ
జిల్లా అధికారి