టాటా ఏస్ బోల్తాపడి వృద్ధుడి దుర్మరణం
తొమ్మిది మందికి గాయాలు
రేగొండ : టాటా ఏస్ వాహనం బోల్తాపడడంతో అం దులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, తొమ్మిది మందికి గాయాలైన సంఘటన మండలంలోని లింగాల – కొడవటంచ గ్రామాల మధ్య శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మడ్తపల్లి గ్రామానికి చెందిన వడ్డెరలు హరితహారంలో భాగంగా మొక్కలను నాటే గుంతలు తవ్వేందుకు కూలీకి వెళ్లారు. తిరిగి సాయంత్రం తమ స్వగ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కొడవటంచ శివారు జోగంపల్లి గ్రామానికి చెందిన మిడిమిళ్ల దేవేందర్ టాటాఏస్ వాహనంలో పరకాల నుంచి రేషన్ బియ్యంతో లోడుతో జోగంపల్లికి వెళ్తున్నాడు. జోగంపల్లి మడ్తపల్లికి పక్క గ్రామం కావడంతో కూలీలు మోటపోతుల ఎర్రయ్య(60)తోపాటు మరో తొమ్మిది మంది కూలీలు లింగాల క్రాస్ వద్ద ఆ వా హనాన్ని ఆపి బియ్యం బస్తాలపై ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొడవటంచ – లింగాల గ్రామాల మధ్య మూలుమలుపు వద్ద టాటాఎస్ వాహనం అదుపుతప్పి బో ల్తాపడడంతో ఎర్రయ్య ఎగిరి టాటా ఏస్ టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో గంధం రమ, రాధ, ఎల్లయ్య, మో టపోతుల భద్రయ్య, మల్లక్క, పవన్, గోళ్ళె న కుమారస్వామి, రమ, సమ్మక్క ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు.