ప్రాణం తీసిన ‘మోపెడ్’
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : వేసవి సెలవులు బంధువుల ఇంట్లో గడుపుదామని వచ్చిన ఐదుగురు చిన్నారులు డీర్ పార్క్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఇద్దరు మృ తి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం. నగరంలోని సప్తగిరికాలనీలో ఎండీ అహ్మద్ కుటుంబం నివాసం ఉంటోంది.
ముంబాయికి చెందిన ఎండీ రియాజ్(12), హైదరాబాద్‌కు చెందిన సహబాజ్(9), సోహెల్(7) వారి తల్లిదండ్రులతో కలిసి అహ్మద్ ఇంటికి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో నగరానికి వచ్చిన చిన్నారులతోపాటు వీరి ఇంటికి సమీపంలో ఉండే అంశాల శ్రీకాంత్(20) కలిసి నగరంలోని డీర్‌పార్క్‌కు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్లారు. ఒక వాహనంపై శ్రీకాంత్‌తోపాటు చిన్నారులు కూర్చోగా మరో వాహనంపై వీరి బంధువులు కూడా వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన వారు పార్క్ మూసిన తర్వాత బయటకు వచ్చారు.
కాంత్ తన మోపెడ్(టీవీఎస్ ఎక్సైల్)పై రియాజ్, సహబాజ్, సోహె ల్, అహ్మద్ కుమారుడు ఆసీఫ్(10)లను తీసుకుని సిరి సిల్ల బైపాస్‌రోడ్డుపై సప్తగిరికాలనీకి బయల్దేరాడు. ఎదురుగా వస్తున్న లారీ, మోపెడ్ ఎదురెదురుగా ఢీకొట్టుకో వడంతో అంశాల శ్రీకాంత్(20) అక్కడిక్కడే మృతి చెం దాడు.
మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. వెనకాలే వస్తున్న బంధువులు సోహెల్, రియాజ్, సహబాజ్, ఆసీఫ్‌లను ఆస్పత్రికి తరలిస్తుండగా సోెహ ల్ మార్గంమధ్యలోనే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని శ్రీకాంత్ మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అ తి వేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఐదుగురు కూర్చోవడంతో కంట్రోల్ కాలేదని వారు తెలిపారు.
ఐదు నిమిషాల్లోనే ప్రమాదం..
శ్రీకాంత్ ఈ మధ్యే డీఎంఎల్టీ ప్రథమ సంవత్సరం పూర్తి చేశాడు. అహ్మద్ కుటుంబంతో పరిచయం ఉండడంతో శ్రీకాంత్‌తో కలిసి పిల్లలను పంపించారు. వీరి వెంట మరో కుటుంబం కూడా పార్క్‌కు వెళ్లింది. వారు ఒక వాహనంపై వస్తుండగా సోహెల్ వారితోపాటే వచ్చాడు. చివరి సమయంలో శ్రీకాంత్‌తో పాటు వెళ్తానని మారం చేయడంతో సోహెల్‌ను అతడి బండిపై కూర్చోబెట్టారు. పార్క్ నుంచి బయలుదేరిన సుమారు ఐదు నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది.