death convicts
-
మారువేషంలో దొంగగా వచ్చి అత్తను చితకబాదిన కోడలు.. కానీ..!
తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. మారువేశంలో దొంగగా వచ్చిన కోడలు అత్తను చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన అత్త ప్రాణాలు కోల్పోయింది. తిరునల్వేలి జిల్లాలోని వడుకనపట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో శణ్ముగవేలు భార్య సీతారామలక్ష్మి (57). వారికి కుమారుడు రామస్వామి, కోడలు మహాలక్ష్మి ఉన్నారు. ఇంట్లో అత్తాకోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో పరిస్థితిని మెరుగుపరచడానికి రామస్వామి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మకాం మార్చినా.. ప్రయోజనం లేకపోయింది. ఇటీవల జరిగిన గొడవ అనంతరం అత్తపై కక్ష పెంచుకున్న మహాలక్ష్మి పథకం వేసింది. మగవారి వేశం వేసి హల్మెట్ పెట్టుకుని అత్త నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడి చేసింది. అత్త నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులకు సీసీటీవీ అధారాలతో అసలు విషయం బయటపడింది. కోడలే ఈ ఘటనకు కారకురాలని తేల్చారు. చదవండి:కంపెనీ డబ్బుతో డ్రైవర్ పరార్... ఓనర్ ఏం చేశాడంటే... -
ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు
Bengali Actor Rahul Arunoday Banerjee Kept Mum For 15 Days: సినిమాల్లో రియల్ స్టంట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచే హీరోలు ఉన్నారు. అలాగే పాత్రలో ఒదిగిపోయేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడతారు కొందరు నటులు. అలాంటి నటుల్లో ఒకరు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ. ఆయన తాజాగా నటించిన బెంగాలీ చిత్రం 'మృత్యుపతోజాత్రి (ఎవరు చనిపోతారో)'. సౌమ్య సేన్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరణశిక్ష పడిన ఖైదీ పాత్రలో రాహుల్ నటించారు. చనిపోవడానికి 12 గంటల ముందు ఖైదీల మానసిక పరిస్థితిని ఇందులో చూపించారు. అయితే ఇందుకోసం షూటింగ్‌కు ముందు సుమారు 15 రోజులు ఎవరితోనూ రాహుల్ మాట్లాడలేదట. కనీసం వారి ఇంటిసభ్యులతో కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నాడట. 'నిజానికి తాము ఎప్పుడూ చనిపోతామో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ, తన జీవితం 12 గంటల తర్వాత ముగుస్తుందని తెలుసు. దానిని అర్థం చేసుకోవడం కష్టం. అతనికి తెలుసు ఆ మరణంలో ఎలాంటి గౌరవం ఉండదని. ఆ సమయంలో అతనికి మద్దతుగా ఎవరు నిలబడరు. నేను చిత్రీకరణకు 15 రోజులు ముందు నుంచే మా ఇంట్లోవాళ్లతో మాట్లాడటం మానేశాను. మా డైరెక్టర్ సౌమ్య సేన్‌గుప్తా చాలా బాగా రీసెర్చ్ చేశారు. చాలా స్టడీ మెటీరియల్స్ ఇచ్చారు.' అని పేర్కొన్నారు నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ. చదవండి: వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. 'ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. ఇది కల్పితమైనప్పటికీ నిజ జీవితంలో ఖైదీల గురించి కొన్ని పుస్తకాలు, న్యాయవాదులు, పోలీసులతో జరిగిన చర్చల ఆధారంగా స్క్రిప్ట్‌ను డెవలప్ చేయడంలో ఉపయోగపడ్డాయి. ఉరిశిక్ష పడిన ఖైదీ చివరి 12 గంటలు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. ఆ సమయంలో అపరాధ భావం, మానసిక సంఘర్షణ, మరణ భయం వంటి విషయాలను ఎలా అనుభవిస్తారో ప్రేక్షకులకు తెలియచెప్పాలనుకున్నాను. ప్రేమ, జీవితాలపై సినిమాలు చేయగలిగినప్పుడు మరణంపై ఎందుకు సినిమా తీయకూడదు.' అని తెలిపారు డైరెక్టర్ సౌమ్య సేన్‌గుప్తా. -
రాజీవ్ హంతకులకు ఊరట
మరణశిక్షను యావజ్జీవానికి మార్చిన సుప్రీంకోర్టు కేంద్రం పిటిషన్ తిరస్కరణ క్షమాభిక్ష పిటిషన్లపై ఇకనైనా వేగంగా స్పందించాలన్న ధర్మాసనం న్యూఢిల్లీ/చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలకు ఊరట లభించింది. ఆ కేసులో ఖైదీలు సంతన్, మురుగన్, పెరారివాలన్‌లకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వారి క్షమాభిక్ష పిటిషన్ 11 ఏళ్ల పాటు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఖైదీల క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యానికి కారణమంటూ ఏమీ లేదని, అయినా ఖైదీలు జైల్లో ఏవిధమైన మానసిన వేదన అనుభవించకుండా సంతోషంగానే ఉన్నారని కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌ను చీఫ్ జస్టిస్ పి. సదాశివం నేతృత్వంలోని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే సింగ్‌తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వ వాదనతో తాము అంగీకరించమన్న ధర్మాసనం.. ప్రభుత్వ జాప్యం వల్లే శిక్ష తగ్గిస్తున్నామని చెప్పింది. ఇకపై క్షమాభిక్ష కోరుతూ దాఖలైన పిటషన్లపై రాష్ట్రపతికి తగిన సమయంలో సూచనలు చేస్తే జాప్యం జరగకుండా ఉంటుందని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. ఈ కేసులో చేసినట్లు కాకుండా ఇకపై క్షమాభిక్ష పిటిషన్లపై కేంద్రం వేగంగా స్పంది స్తుందని తాము నమ్ముతున్నామని చెప్పింది. క్షమాభిక్షపై నిర్ణయంలో తీవ్ర జాప్యం జరిగిన కారణంగా తమ శిక్షను పునస్సమీక్షించాలంటూ ఆ ముగ్గురు ఖైదీలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 4న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో పెట్టిన విషయం తెలిసిందే. ఖైదీలను విడుదల చేయాలి సుప్రీంకోర్టు తీర్పును తమిళనాడులోని డీఎంకే, డీఎండీకే, ఎండీఎంకేతో సహా వివిధ రాజకీయ పక్షాలు స్వాగతించాయి. 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ ముగ్గురు ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి. ఖైదీలను విడుదల చేస్తే తనకు మరింత సంతోషమని కరుణానిధి అన్నారు. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఎండీఎంకే చీఫ్ వైకో డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు వినగానే ఖైదీల ముఖంలో సంతోషం వెల్లివిరిసిందని వెల్లూరు సెంట్రల్ జైలు అధికారులు చెప్పారు. పెరారివాలన్ తల్లి అర్పుతమ్ అమ్మాళ్ చీఫ్ జస్టిస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన కుమారుడి విడుదల కోసం ఎదురు చూస్తానని తెలిపారు.