death issue
-
విద్యుత్ షాక్‌తో కౌలురైతు మృతి
సాక్షి, కడియం (రాజమహేంద్రవరం రూరల్): దుళ్ల గ్రామానికి చెందిన కౌలురైతు తోట చింతాలు (59) పొలంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కౌలుకు తీసుకున్న చేనులో మోటారు తిరగడం లేదని అతడు గోతిలోకి దిగి చూశాడు. మోటార్‌ను తాకిన వెంటనే షాక్‌కు గురై గోతిలో కుప్పకూలిపోయాడు. తోటి రైతులు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సరఫరాను నిలిపివేసి అతడిని బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు స్థానిక ప్రైవేటు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎల్.కనకరాజు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని కడియం ఎసై ఎ.వెంకటేశ్వరరావు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కౌలురైతు చింతాలు (ఫైల్) -
కవితాక్షేత్రంలో ఒక మహావృక్షం
సినారె మృతికి అదృష్టదీపక్ సంతాపం రామచంద్రపురం : అభ్యుదయ భావాలను శ్వాసిస్తూ, ఆధునిక కవిత్వాన్ని శాసించిన అగ్రశ్రేణి కవి సి.నారాయణరెడ్డి అని ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, విమర్శకులు అదృష్ణదీపక్ తెలిపారు. సినారె మృతికి ఆయన సోమవారం సంతాపం తెలిపారు. కుర్రకారుతో పోటీపడుతూ చలన శీలమైన ఆలోచనలతో క్రమం తప్పకుండా ప్రతి పుట్టిన రోజునా ఒక కొత్త కవితా సంపుటితో అభిమానులను అలరింజేసిన సినారె నిస్సందేహంగా తెలుగు కవితాక్షేత్రంలో ఒక మహావృక్షం. తెలుగు సాహిత్యాన్ని సారస్వత సభలనూ అపారమైన విద్వత్తుతో, చమత్కారాలతో రసప్లావితం చేసిన సరస్వతీనది ఈవేళ అంతర్ధానమైపోయిందని పేర్కొన్నారు. సాహితీ లోకంలో మేరు పర్వతం ఒరిగిపోయిందని, పద్యమైనా, గద్యమైనా, గేయమైనా తనదైన ముద్రతో సారవంతం చేసి భావితరాలకు మార్గదర్శకుడయ్యాడు. అంగారమైనా, శృంగారమైనా హద్దులు దాటని భావాలను అలవోకగా అందించిన అక్షర శిల్పిసినారె. అందమైన పంచెకట్టుతో అచ్చమైన తెలుగుతనానికి చిరునామాగా నిలిచిన పెద్దదిక్కు సినారె. భౌతికంగా దూరమైనా తెలుగు భాషా సాహిత్యాలపై చెరిగిపోని సంతకం చేసిన నిత్యయవ్వనుడు సినారె. మాదాల రంగారావు, టీ.కృష్ణ, సినిమాలకు సినారెతో కలిసి పనిచేసిన సందర్భాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా మిలిగిపోతాయి’ అని అదృష్టదీపక్ తన జ్ఞాపకాలను వివరించారు. -
ఎంపీ సోదరుడి కుమారుడిపై హత్యారోపణలు
గోరంట్ల: అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులు ఘర్షణకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. పెనుగొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ముఖ్య అనుచరుడు నరేష్ ఈ నెల 15న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ప్రమాదం వెనుక హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప సోదరుడి కుమారుడు నిమ్మల యువశేఖర్ హస్తం ఉందని, ప్రమాదం ముసుగులో హత్య చేశారని నరేష్ బంధువులు ఆరోపించారు. మృతుని బంధువులు సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. గోరంట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వారం రోజులైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ నిరసనకు దిగారు. ఈ విషయం తెలిసిన ఎంపీ కిష్టప్ప, ఆయన అనుచరులు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా చేస్తున్నవారిపై దాడికి ప్రయత్నించారు.