ఏబీసీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పత్రికల సర్క్యు లేషన్ వ్యవహారాలను పర్యవేక్షించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా కోకకోలా సంస్థ ఆగ్నేయాసియా రీజియన్ వ్యవహారాల ఉపాధ్యక్షుడు దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017–18 సంవత్సరానికి గాను ఈ పదవిలో ఉంటారు. వ్యూహాత్మక ప్రణాళికలు, విక్రయాలు, మార్కెటింగ్ ఆపరేషన్లలో 23 ఏళ్లకుపైగా అనుభవమున్న ఆయన.. దేశంలో కోకకోలా సంస్థ విక్రయాలు, డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్లను విస్తరించడంలో కీలకపాత్ర పోషించారు.
ఇక ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా ముంబై సమాచార్ పత్రికకు చెందిన హర్మూస్జీ ఎన్ కమా, ఏబీసీ సచివాలయం సెక్రటరీ జనరల్‌గా హర్మూజ్ మాసాని ఎన్నికయ్యారు. వీరితోపాటు అడ్వర్టైజర్లు, పబ్లిషర్లు, అడ్వరై్టజింగ్ ఏజెన్సీల ప్రతినిధులుగా ఎన్నికైనవారి జాబితాను ఏబీసీ గురువారం విడుదల చేసింది.
అడ్వరై్టజర్ల ప్రతినిధులు..
దేబబ్రత ముఖర్జీ, కొకాకోలా ఇండియా లిమిటెడ్ (చైర్మన్)
హేమంత్ మాలిక్, ఐటీసీ లిమిటెడ్ (గౌరవ కార్యదర్శి)
సందీప్ తర్కాస్, ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్
మయాంక్ పరీక్, టాటా మోటార్స్ లిమిటెడ్
పబ్లిషర్ల ప్రతినిధులు..
హర్మూస్జీ ఎన్ కమా, ది బాంబే సమాచార్ (డిప్యూటీ చైర్మన్)
ఐ.వెంకట్, ఉషోదయా ఎంటర్ప్రైజెస్
శైలేష్ గుప్తా, జాగరణ్ ప్రకాశన్
దేవేంద్ర వి దార్దా, లోక్మత్ మీడియా
బెనాయ్ రాయ్ చౌధురి, హెచ్‌టీ మీడియా
చందన్ మజుందార్, ఏబీపీ
రాజ్‌కుమార్ జైన్, బెన్నెట్, కోల్మన్ అండ్ కంపెనీ
ప్రతాప్ జి.పవార్, సకల్ పేపర్స్
అడ్వరై్టజింగ్ ఏజెన్సీల ప్రతినిధులు
మధుకర్ కామత్, డీడీబీ ముద్రా ప్రైవేట్ లిమిటెడ్ (గౌరవ కోశాధికారి)
శశిధర్ సిన్హా, ఐపీజీ మీడియా బ్రాండ్స్
శ్రీనివాసన్ కె స్వామి, ఆర్కే స్వామి బీబీడీవో ప్రైవేట్ లిమిటెడ్
సీవీఎల్ శ్రీనివాస్, గ్రూప్ ఎం మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్