పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: 2016 డిసెంబర్ నెల టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) లేదా టోకు ద్రవ్యోల్బణం 3.39గా నమోదైంది. మునుపటి నెలలో 3.15 శాతంతో పోలిస్తే ఇది 1.06 శాతం ఎక్కువ. ఆహార ద్రవ్యోల్బణం రేటు (ఇయర్ ఆన్ ఇయర్ ) -0.70 శాతంగా నమోదైంది. గత నెల 1.54తో పోలిస్తే క్షీణించి 2015 ఆగస్టు తరువాత మొదటి సారి నెగిటివ్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఈ వివరాలను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ నెలలో 'ఆల్ కమోడిటీస్' టోకు ధర సూచిక 182.8 (తాత్కాలిక) గా నమోదైంది. గత నెలలో (తాత్కాలిక) 183.1 తో పోలిస్తే 0.2 శాతం తగ్గింది.
కాగా డిసెంబర్ 31, 2016తో ముగిసిన డీమానిటైజేషన్ నేపథ్యంలో డబ్ల్యుపిఐ గణాంకాలు కీలకంగా మారనున్నాయి.