'అవును.. గవర్నర్ గంగిరెద్దే'
చిత్తూరు: గవర్నర్ నరసింహన్‌పై విమర్శలకు టీడీపీ నేతలు మరింత పదునుపెట్టారు. 'గవర్నర్ తెలంగాణ ప్రభుత్వం చెప్పినదానికల్లా గంగిరెద్దులా తల ఊపుతున్నరు' అంటూ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే కొత్తగా ఎమ్మెల్సీ పదవి చేపట్టిన టీడీపీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు సరిగ్గా అలాంటి కామెంట్లే చేశారు.
శనివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన ' అవును.. గవర్నర్ సరసింహన్ గంగిరెద్దే. ఆర్టికల్- 8ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇష్టారీతిగా వార్తలు ప్రసారం చేసిన ఛానెల్ కు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని పేర్కొన్నారు.