18 నుంచి డీఎడ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 18 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఈ సెట్ కన్వీనర్ రమణకుమార్ వెల్లడించారు. డీఈఈ సెట్లో అర్హత సాధించి న విద్యార్థులకు అన్ని జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) ఈ నెల 18, 19 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
డైట్లో 2 వేల మందిలోపు విద్యార్థులుంటే 3 మూడు బృందాలు, 2001 నుంచి 3 వేల లోపు 4 బృందాలు, 3 వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే 5 బృందాలతో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు(ఠీఠీఠీ.ఛ్ఛీ్ఛఛ్ఛ్టి.ఛిఛీట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn) ఇచ్చుకోవాలని.. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తామని వివరించారు. సెట్ ఫలితాలను మంగళవారం రాత్రి వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఇవీ ప్రధాన అర్హతలు..
విద్యార్థులు ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే 45 శాతం మార్కులు సాధించినా సరిపోతుంది. ఆర్జీయూకేటీ ట్రిపుల్ఐటీ విద్యార్థులు, ఇంటర్, ఏపీ ఓపెన్ స్కూల్, తెలంగాణ ఓపెన్ స్కూల్, నేషనల్ ఓపెన్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసిన వారూ అర్హులే. ఉర్దూ ఫాసిల్, వొకేషనల్, బ్రిడ్జి కోర్సు సర్టిఫికెట్లు ఉన్న వారు, అదనపు లాంగ్వేజ్ సర్టిఫికెట్లు ఉన్న వారు అనర్హులు. వివరాలకు 040–632288540ను సంప్రదించవచ్చు.
195 కాలేజీలు.. 11,350 సీట్లు
రాష్ట్రంలోని 195 డీఎడ్ కాలేజీల్లో 11,350 సీట్లకు ప్రవేశాలు చేపట్టనున్నారు. డీఈఈ సెట్‌కు 32,783 మంది దరఖాస్తు చేసుకోగా ప్రవేశ పరీక్షకు 26,182 మంది హాజరయ్యారని.. 18,106 మంది అర్హత సాధించారు.
సర్కారులో వార్షిక ఫీజు రూ.2,385
ప్రభుత్వ డైట్ కాలేజీల్లో రూ. 2,385 వార్షిక ఫీజుగా నిర్ణయించారు. ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో రూ. 12,500 ఫీజుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అందు లో ట్యూషన్ ఫీజు రూ.11 వేలు, స్పెషల్ ఫీజు రూ.1,500గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఇదీ షెడ్యూలు
18–6–2018, 19–6–2018: డైట్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
20–6–2018 నుంచి 22–6–2018: వెబ్ ఆప్షన్లకు అవకాశం
25–6–2018 లేదా 26–6–2018: సీట్ల కేటాయింపు
26–6–2018, 27–6–2018: ఫీజు చెల్లింపు
26–6–2018 నుంచి 30–6–2018 వరకు: ఫైనల్ అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్
30–6–2018 లోపు: కాలేజీల్లో చేరికలు
1–7–2018 నుంచి: తరగతులు ప్రారంభం