ప్రపంచకప్ ఆశలు గల్లంతు
కౌలాలంపూర్: వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలన్న భారత మహిళల హాకీ జట్టు ఆశలు గల్లంతయ్యాయి. గురువారం జరిగిన ఆసియా కప్ సెమీస్‌లో భారత్ 1-2తో డిఫెండింగ్ చాంపియన్ కొరియా చేతిలో ఓడింది.
భారత్ తరఫున రితూ రాణి (41వ ని.) ఏకైక గోల్ సాధించగా... చియోన్ సుల్ కి (2వ ని.), చియోన్ యున్ బి మిన్ (9వ ని.)లు కొరియాకు గోల్స్ అందించారు. శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో భారత్.. చైనాతో తలపడనుంది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కొరియన్లు 10 నిమిషాల వ్యవధిలో రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచారు. 41వ నిమిషంలో లభించిన పెనాల్టీని రితూ రాణి గోల్‌గా మలిచింది.