Degree girl student
-
యువతి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కందరి హైందవి(21) శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. హైందవి కరీంనగర్‌లోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీలో బీఎస్సీ కోర్సు ఇటీవలే పూర్తిచేసింది. ఇంటివద్ద ఉంటూ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. కడుపునొప్పితో శరీరం రోజురోజుకి బలహీనంగా మారుతుందని మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఉదయం ఇంట్లోని సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కడుపునొప్పితో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హైందవి సూసైడ్ నోట్ రాసింది. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగేశ్వర్రావు పరిశీలించారు. మృతురాలి తండ్రి హన్మంతరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
ఆమెకు 20, అతనికి 16..
ఈ కలియుగంలో వింతలకు చోటు లేదు. డిగ్రీ అమ్మాయి, 16 ఏళ్ల బాలుని మధ్య ఫేస్బుక్ ద్వారా ప్రేమ పుట్టి, అది పెళ్లితో ముగిసింది. కొద్దిరోజులు కాపురం చేశాక అసలు కథ మొదలైంది. మూడురోజులుగా పోలీసు స్టేషన్లో కొనసాగుతూనే ఉంది. దొడ్డబళ్లాపురం:ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఒక మైనర్ బాలుడు, తనకన్నా నాలుగేళ్లు పెద్దదయిన దివ్యాంగురాలయిన యువతి పెళ్లి చేసుకున్నారు. పట్టుమని 15 రోజులు సంసారం చేయగానే ఆ అబ్బాయి ఆమెను వదిలేసి పరారయ్యాడు. ఈ వింత సంఘటన దొడ్డ తాలూకాలోని కొనఘట్ట గ్రామంలో చోటుచేసుకుంది. ఇప్పుడతన్ని పట్టుకొచ్చి పంచాయతీ పెట్టారు. వివరాలు.. పోలియో బాధితురాలైన ఒక యువతి (20)ది తాలూకాలోని కొనఘట్ట గ్రామం. దొడ్డ పట్టణంలోని ఒక కాలేజీలో బీఏ చదువుతోంది. ఈమెకు 5 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా బెంగళూరు ఉత్తర తాలూకా బేగూరుకు చెందిన 16 ఏళ్ల బాలునితో పరిచయం కుదిరింది. నెమ్మదిగా ఫోన్లలో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడూ కలిసేవారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఇద్దరూ బాగేపల్లిలోని ఒక దేవాలయంలో పెళ్లి కూడా చేసుకున్నారు. 15 రోజులు అక్కడే స్నేహితుడి ఇంట్లో గడిపారు. ఇటు అమ్మాయి తల్లిదండ్రులు కూతురికోసం తెలిసిన చోటల్లా వెదికి చివరకు బాగేపల్లిలో ఉన్నారని కనుక్కుని ఇద్దరినీ ఇంటికి తీసుకువచ్చారు. నాకేం తెలిదంటున్న బాలుడు అయితే మైనర్ బాలుడు ఇంటికి వెళ్లి వివాహం రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన పత్రాలు, తల్లిదండ్రులను ఒప్పించి తీసుకువస్తానని చెప్పి వెళ్లినవాడు తిరిగి రాలేదు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, బాలున్ని వెతికి పట్టుకొచ్చారు. ఈలోపే బాలుడు ప్లేటు ఫిరాయించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియదని బుకాయించాడు. నిందితుడు మైనర్ కావడంతో పోలీసులకు కూడా ఏం చేయాలో పాలుపోలేదు. అమ్మాయేమో తన భర్త తనకు కావాలని పట్టుబట్టింది. దీంతో ప్రజా విమోచనా చళువళి నాయకులు యువతికి న్యాయం చేయాలంటూ డీవైఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. -
డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. పరిస్థితి విషమం
మిడ్జిల్(మహబూబ్‌నగర్): డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. మిడ్జిల్ మండలం మసిగొండ్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని (18) షాద్‌నగర్‌లో ఓపెన్ డిగ్రీ చదువుతోంది. బుధవారం మండలకేంద్రానికి వచ్చి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న తన ఇంటర్ క్లాస్మేట్ అయిన మిడ్జిల్‌కు చెందిన ఆంజనేయులు ఆమెను ఇంటి వద్ద దిగబెడతానంటూ మోటార్‌సైకిల్ ఎక్కించుకున్నాడు. జగబోయిన్‌పల్లి గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఆమెను అక్కడే వదిలి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని 108లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని కూడా కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై మిడ్జిల్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
మధిర(ఖమ్మం): డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమర్లపూడి లలిత(21) డిగ్రీ పూర్తి చేసి ఇంటిదగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. కాగా.. మృతురాలి సోదరుడు మాత్రం తన చెల్లె నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్య చేసుకుందని.. అనంతరం ఉరి వేసుకుందని పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. ఇంట్లో ఉరి వేసుకోవడానికి అవకాశమే లేదని పోలీసులు అనడంతో ఆమె సోదరుడు ఈ కథ అల్లడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.