మిడ్జిల్(మహబూబ్‌నగర్): డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. మిడ్జిల్ మండలం మసిగొండ్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని (18) షాద్‌నగర్‌లో ఓపెన్ డిగ్రీ చదువుతోంది. బుధవారం మండలకేంద్రానికి వచ్చి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న తన ఇంటర్ క్లాస్‌మేట్ అయిన మిడ్జిల్‌కు చెందిన ఆంజనేయులు ఆమెను ఇంటి వద్ద దిగబెడతానంటూ మోటార్‌సైకిల్ ఎక్కించుకున్నాడు. జగబోయిన్‌పల్లి గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు.
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఆమెను అక్కడే వదిలి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని 108లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని కూడా కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై మిడ్జిల్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. పరిస్థితి విషమం
Published Wed, Mar 9 2016 9:32 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM
Advertisement
Advertisement