డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ఏఎన్యూ: ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను రెక్టార్ ఆచార్య సాంబశివరావు విడుదల చేశారు. ఫలితాలను www.anu.ac.inవెబ్సైట్ ద్వారా పొందొచ్చని సూచించారు. రీవా ల్యుయేషన్కు డిగ్రీ మొదటి సెమిస్టర్లో అన్ని కోర్సుల నుంచి రెగ్యులర్ విద్యార్థు లు 4,756 మంది దరఖాస్తు చేసుకోగా 1,131 మంది ఉత్తీర్ణులయ్యారు.
డిగ్రీ మొదటి సెమిస్టర్లో అన్ని కోర్సుల నుంచి సప్లిమెంటరీ విద్యార్థులు 1,222 మంది దరఖాస్తు చేసుకోగా 143 మంది.. మూడో సెమిస్టర్ రెగ్యులర్లో అన్ని కోర్సుల నుంచి 5,331 మంది దరఖాస్తు చేసుకోగా 1,377 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. డిసెంబర్లో నిర్వహించిన ఎంఏ ఇంగ్లిష్, ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఎల్ఎల్ఎన్ కోర్సుల పరీక్షల జవాబు పత్రాల రీవాల్యు యేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు దూరవిద్య పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ఆంజనేయరెడ్డి తెలిపారు.