హత్యకేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు
డెహ్రాడూన్: ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి డీపీ యాదవ్ కు డెహ్రాడూన్ సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. 1992 సెప్టెంబర్ లో మహేంద్ర సింగ్ భట్టి, అతని స్నేహితుడు ఉదయ్ ప్రకాష్ ఆర్య దారుణంగా హత్యకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో డీపీ యాదవ్, కరణ్ యాదవ్, ప్రనీ భట్టిలపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈకేసులో సీబీఐ కోర్టు జడ్జ్ అమిత్ కుమార్ సిరోహి.. డీపీ యాదవ్ సహా మరో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.