మూసీని పరిశీలించిన ఢిల్లీ బృందం
ఘట్కేసర్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యుల బృందం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలో మూసీ నది పరిసర ప్రాంతంలో పర్యటించింది. ఈ మేరకు మూసీ నది కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మ్యానేజింగ్ కమిటీ మంగళవారం పర్యటించి నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను త్వరలోనే సుప్రీంకు సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.