ఫిర్యాదు వచ్చింది.. మంత్రి పదవి ఊడింది!
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఆసిం అహ్మద్ ఖాన్ పదవి ఊడింది. అహ్మద్ ఖాన్ ను మంత్రి పదవి నుంచి తొలగించినట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అహ్మద్ ఖాన్ పై తమకు అందిన ఫిర్యాదును సీబీఐకి బదిలీ చేస్తామని చెప్పారు. అవినీతిని సహించబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అహ్మద్ ఖాన్ స్థానంలో నూతన ఆహార శాఖ మంత్రిగా ఇమ్రాన్ హుస్సేన్ ను నియమించారు.
హస్తినలో రెండోసారి గద్దెనెక్కినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. న్యాయశాఖ మంత్రులుగా పనిచేసిన సోమనాథ్ భారతి, జితేందర్ సింగ్ తోమర్ కేసుల్లో ఇరుక్కున్నారు. గృహహింసలో కేసులో సోమనాథ్, నకిలీ డిగ్రీ కేసులో తోమర్ కోర్టు మెట్లు ఎక్కారు.