మధుమేహగ్రస్తులకు డిలైట్ మెడ్లి ప్రో
యాంత్రిక జీవనంలో కొట్టుమిట్టాడుతున్న నగర వాసులకు ప్రస్తుత పరిస్థితుల్లో నాణ్యమైన ఆహారం లభించడం లేదు. ఉరుకులు, పరుగుల జీవితం...ఇంటిలో సరైన సమయానికి ఫుడ్ అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితుల్లో నగర వాసులు ఎక్కువగా బయట దొరికే ఆహారంపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఆకలి వేసినపుడు ఏది అందుబాటులో ఉంటే దాన్నే తినేస్తున్నారు. ఇందులో జంక్ ఫుడ్‌ను లాగిస్తున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నారు. పని ఒత్తిడికి తోడు విటమిన్లు లోపించిన ఆహారాన్ని తినడం వల్ల చాలా మంది మధుమేహం బారినపడుతున్నారు.
ఈ మధుమేహగ్రస్తులకు అవసరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నాచారంలోని శ్రీ కళ్యాణి కలినరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ శ్రీ కళ్యాణి ట్రేడింగ్ కంపెనీ ద్వారా ‘అమ్మే’ అనే పేరుతో ‘డిలైట్ మెడ్లీ ప్రొ’ అనే ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ప్రొడక్ట్ డయాబెటిక్ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. తొమ్మిది రకాల నాణ్యమైన చిరుధాన్యాలతో దీన్ని తయారు చేశారు. ఇందులో శనగలు, పెసలు, బార్లీ, రాగులు, సజ్జలు, సోయా, మెంతులు, ఉసిరికాయ, అలసంద (ఛిౌఠీఞజ్ఛీ) వంటి ధాన్యాలతో పౌడర్‌గా తయారు చేశారు. ఈ పౌడర్‌ను గ్లాసు నీటిలో రెండు నిమిషాలు మరుగబెట్టి జావలాగా తయారు కాగానే దాన్ని తాగాలి.
మధుమేహగ్రస్తులు గంట గంటకు ఏదో ఒకటి తినాలి... ఆ తినే స్థానంలోనే జావను తాగాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కెమికల్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, కొలెస్ట్రాల్ లేని పౌడర్ ఇది. బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అమ్మ చేతి నుంచి తయారైన వంట ఎంత రుచిగా ఉంటుందో.. అంత శ్రేష్టమైనది ఈ పౌడర్. అందుకే దీనికి ‘అమ్మే’ అని పేరు పెట్టామని సంస్థ డెరైక్టర్ జయశ్రీ శ్రీధర్ చెప్పారు. డైటీషియన్స్ కూడా ఈ ప్రొడక్ట్‌ను సూచిస్తున్నారన్నారు. డిలైట్ మెడ్లీ ప్రొ మధుమేహగ్రస్తులకు మంచిగా పని చేస్తుందని, డయాబెటిక్‌ను కంట్రోల్లో పెడుతుందన్నారు. సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో, నాణ్యమైన చిరుధాన్యాలతో తయారు చేయడం జరిగిందని వివరించారు.