కుక్కపిల్లకు బారసాల
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): శునకం అంటే విశ్వాసానికి ప్రతీక. అంతకంటే దానిక యజమానికి కుక్క అంటే అమితమై న ప్రేమ. అందు కే.. ఆ కుక్క ప్రసవిస్తే బారసాల నిర్వహించి ఔరా అనిపించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేం ద్రానికి చెందిన ఒగ్గు బాల్రాజుయాదవ్కు కుక్కపిల్లలంటే ప్రాణం.తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్క ఇటీవల పప్పీకి జన్మనిచ్చింది. దీంతో సమీపంలోని పదిమంది ముత్తయిదువలను తన ఇంటికి పిలి చాడు. సంప్రదాయబద్ధంగా బారసాల నిర్వహిం చారు. అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు.