Demolition of illegal construction
-
నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం.. కన్నీరు మిగిల్చిన హైడ్రా కూల్చివేతలు
-
స్వతంత్ర భారతంలో అది అతి పెద్ద విధ్వంసం: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులు ఉన్నఫలంగా ఇళ్లను కూల్చివేశారు. బుల్డోజర్ల అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రజల షాపులు, ఇళ్లను బీజేపీ.. బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని తప్పుబట్టారు. ఢిల్లీలో 80 శాతం ఇండ్లు ఆక్రమణలోనే ఉన్నాయి. వాటన్నింటినీ కూల్చివేస్తే.. స్వతంత్ర భారత దేశంలో అది అతిపెద్ధ విధ్వంసమని అభివర్ణించారు. ఈ క్రమంలో 63 లక్షల మంది ప్రజల ఇళ్లు, షాపులు కూల్చివేతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఢిల్లీలో దాదాపు 50 లక్షల మంది అనధికార కాలనీల్లో, 10 లక్షల మంది 'జుగ్గీల్లో' నివాసం ఉంటున్నారని తెలిపారు. వారి ఇళ్లను కూల్చివేస్తారా..? అని బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీలో శాంతి కాలనీలు, మురికివాడలను తొలగించాలన్నది వారి(బీజేపీ) ఆలోచన అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మురికివాడల్లో ఉన్నవారికి ఇళ్లు సమకూరుస్తామని చెప్పిన బీజేపీ దానికి బదులు ఇళ్లను కూల్చేస్తోందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నేతృత్వంలోని మున్సిపల్ కార్పొరేషన్లు చేపడుతున్న ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌ను వ్యతిరేకించినందుకు జైలుకు వెళ్లేందుకు ఆప్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ వారికి సూచించారు. ఇది కూడా చదవండి: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే -
అక్రమ కట్టడం కూల్చిందెవరు..?
భిక్కనూరు: మండల కేంద్రంలోని జీపీ ఎదురుగా నిర్మిస్తున్న అక్రమ కట్టడం పిల్లర్లను ఎవరు కూల్చారన్న విషయం భిక్కనూరులో చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయం ప్రొక్లెయిన్‌తో ప్రజలందరు చూస్తుండగానే రెండు పిల్లర్లను కూల్చివేశారు. ఈ విషయమై గ్రామసర్పంచ్ తున్కి వేణు, పాలకవర్గం సభ్యులు, ఈఓ రజనీకాంత్‌రెడ్డి తమకేమీ సంబంధం లేదని సమాధానమిస్తున్నారు. దీంతో ఎవరు ఈ అక్రమ కట్టడం పిల్లర్లను కూల్చారని ప్రశ్నించుకున్నారు. జీపీ వారే పిల్లర్లను కూలగొట్టించి మిన్నకుంటున్నారని కొందరు భావిస్తున్నారు. అక్రమ కట్టడం పిల్లర్లను కూలగొట్టించి జీపీ పాలకవర్గం తమకు తెలియదనడం ఎంత వరకు సమంజసమని మరికొందరు అంటున్నారు. ప్రొక్లెయినర్ యజమానిని, డ్రైవర్‌ను రప్పించి ఎవరు కూలగొట్టారన్న విషయమై ఆరా తీస్తామని గ్రామపెద్దలు అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఈఓ కిషన్‌రావును కలెక్టర్ సత్యనారాయణ గతంలో సస్పెండ్ చేసి, సర్పంచ్ తున్కి వేణుకు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం విధితమే. పాలకవర్గ సభ్యులు మొదట అనుమతిచ్చి కలెక్టర్ ఈ విషయంలో సీరియస్‌గా ఉండడంతో అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఈ విషయం మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో చర్చనీయాంశంమైంది. తిరిగి ఆదివారం పిల్లర్లు కూల్చిన విషయం తమకు తెలియదని జీపీ పాలకవర్గం అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ కట్టడమైతే పూర్తిగా తొలగించాల్సింది పోయి, రెండు పిల్లర్లు మాత్రం ఎందుకు తొలగించారన్న విషయంపై గుసగుసలు వినిపించాయి. -
అక్రమ నిర్మాణం కూల్చివేత
భివండీ, న్యూస్‌లైన్: అక్రమ నిర్మాణాలపై (బీఎన్‌ఎంసీ) కొరడా ఝళిపించింది. ఎటువంటి అనుమతులు పొందకుండానే ప్రభాగ్ సమితి నాలుగులో నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని కార్పొరేషన్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం కూల్చారు. నవీన్ గౌరీపాడా ప్రాంతానికి చెందిన నయీమ్ పఠాన్‌కు చెందిన ఖాళీస్థలాన్ని అక్రమ్ శేఖ్ అనే బిల్డర్ అభివృద్ధి కోసం తీసుకున్నాడు. అయితే కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా మూడంతస్తుల భవన నిర్మాణ పనులను చేపట్టాడు. ఈ నేపథ్యంలో పనులు నిలిపివేయాల్సిందిగా కార్పొరేషన్ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. అయినా బిల్డర్ ఆ నోటీసులను పట్టించుకోకుండా పనులను కొనసాగించాడు. దీంతో స్థానిక బోయివాడ స్టేషన్‌కు చెందిన పోలీసుల బందోబస్తు మధ్య కార్పోరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చారు. ఇందులో నాలుగో ప్రభాగ్ సమితి అధికారి సునీల్ బాలేరావ్తోపాటు గోండాంబే, బాలారామ్ జాదవ్, భగత్ ఉగడే, సోమనాథ్ సోస్టే, దిలీప్ మాళీ, శేఖర్ మడకే తదితరులున్నారు. ఇదిలాఉండగా పట్టణంలో ప్రస్తుతం సుమారు వెయ్యికిపైగా నిర్మాణాలు అనుమతులు లేకుండా జరుగుతున్నట్టు తెలియవచ్చింది.