అలాంటి బాస్‌లతో అనారోగ్యం!
లండన్: పరిమితికి మించి పనిచేయాలని డిమాండ్ చేసే మేనేజర్లు ఉద్యోగుల ఆరోగ్యానికి హాని చేసే అవ కాశముందని సర్వేలో తేలింది. లండన్‌లోని ఈస్ట్ ఆంగ్లియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ‘ఉద్యోగులపై ఒత్తిడి పెంచితే వారు అనారోగ్యంతో గైర్హజరవుతారు.
తొలిసారిగా విధులకు హాజరు కావాలనే ఆరాటం, అనారోగ్యం వల్ల గైర్హాజరీ, ‘మార్పుకు యత్నించే నాయక త్వం’ మధ్య సంబంధాన్ని పరిశీలించారు. తొలిదశలో ఈ నాయకత్వంతో ఉద్యోగుల్లో సానుకూల ఫలితాలొచ్చినా, తర్వాత పరిస్థితులు మారాయి. 155 మంది డెన్మార్క్ పోస్టల్ సిబ్బందిపై అధ్యయనం జరపగా సహోద్యోగులకన్నా 14 రోజులుఅధికంగా పనిచేసిన వారిలో అనారోగ్యాన్ని గుర్తించారు.