రెండోరోజు ప్రశాంతంగా డీఎస్సీ
కర్నూలు(జిల్లా పరిషత్) : టెట్ కమ్ టెర్ట్(డీఎస్సీ) పరీక్ష రెండోరోజూ ప్రశాంతంగా జరిగింది. ఉదయం భాషోపాధ్యాయులు(లాంగ్వేజ్ పండిట్)లకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 6, 578 మంది దరఖాస్తు చేసుకోగా 5, 897 మంది హాజరయ్యారు. మొత్తం 681 మంది గైర్హాజరయ్యారు.
మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన పీఈటీ పరీక్షకు 477 మంది దరఖాస్తు చేసుకోగా 380 హాజరుకాగా 97 మంది గైర్హాజరైనట్లు డీఈవో డీవీ సుప్రకాష్ చెప్పారు. ఆయన నగరంలోని ఉస్మానియా, లిటిల్ బర్డ్ హైస్కూల్లలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
నేడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు
సోమవారం 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు కర్నూలు నగరంలోని 34 కేంద్రాలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పోస్టులకు డిఎస్సీ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 7,140 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు 109 కేంద్రాల్లో నిర్వహించే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ పోస్టులకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 23,567 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
డీఎస్సీకి 200బస్సులు
కర్నూలు(రాజ్‌విహార్): ఈనెల 11వ తేదీన డీఎస్సీ, టెట్ పరీక్షల కారణంగా 200 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజరు కృష్ణమోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి ఈ బస్సులు తిరుగుతాయన్నారు.