ఆధార్ నంబర్ తప్పనిసరి : డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థులంతా ఆధార్ నెంబర్ పొందేలా చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ అంజయ్య సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి విద్యార్థికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరన్నారు. ఆధార్ నంబర్ లేని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 14న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు జేసీ నిర్వహించబోయే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని సూచించారు. అలాగే జిల్లాలో 1,82,185 మంది బయోమెట్రిక్ లేని విద్యార్థులు ఉన్నారన్నారని, వీరంందరినీ సమీపంలోని మీసేవా, ఆధార్సెంటర్లకు తీసుకెళ్లి అప్డేట్ చేయించాలన్నారు.