డిపాజిట్ల పెరుగుదలకు దోహదం
పెద్ద నోట్ల నిషేధంపై ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్
ముంబై: నల్లధనం నిరోధానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు బ్యాంకుల్లో డిపాజిట్ వృద్ధిరేటు పెరుగుదలకు దోహద పడుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచర్ గురువారం పేర్కొన్నారు. ఆమె ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో కస్టమర్లు ఎటువంటి ఇబ్బందులూ ఎదుర్కొనకుండా చూడ్డంపై అధికంగా దృష్టి సారిస్తున్నట్లు ఆమె తెలిపారు. తగిన రీతిలో రూ. 100 నోట్లను బ్రాంచీలకు భారీగా తరలించినట్లు వెల్లడించారు.
క్యాష్ అరుుపోవడం అనేది తమ బ్యాంకు బ్రాంచీల్లో ఎక్కడా చోటుచేసుకోలేదని వివరించారు. గురువారం సాయంత్రమే తమ బ్యాంక్ ఏటీఎంలు కస్టమర్లకు సేవలు అందించడం ప్రారంభించాయనీ వివరించారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో డిపాజిట్ల వృద్ధిని గమనిస్తున్నట్లు తెలిపారు. ‘అరుుతే డిపాజిట్లు ఏ స్థారుులో వచ్చాయన్నది చెప్పడం సరికాదుకానీ, పలు బ్రాంచీల్లో 70 శాతం అధికంగా డిపాజిట్లు వచ్చాయన్నది సమాచారం. సాధారణ పరిస్థితులతో పోల్చితే ఇది రెట్టింపు’ అని వివరించారు. నల్లధనం నిరోధంలో ప్రధాని మోదీ తగిన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.