ఏసీబీకి చిక్కిన డిప్యూటి డైరెక్టర్
కరీంనగర్ : బిల్లులు పాస్ చేసేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కరీంనగర్ వ్యవసాయ శాఖ డిప్యూటి డైరెక్టర్ క్రిష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ మార్కెట్ కమిటీలో నిర్మించిన షెడ్డుకు సంబంధించిన బిల్లులు పాస్ చేసేందుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు తిరుపతయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ డైరెక్టర్.. తిరుపతయ్య వద్ద నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని నిందితుడు క్రిష్ణయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.