అది ప్రకృతికి విరుద్ధం.. మేం ఒప్పుకోం
నైరోబీ: తాము స్వలింగ సంపర్కానికి వ్యతిరేకం అని కెన్యా ఉపాధ్యక్షుడు విలియమ్ రూటో స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు తాము ఏమాత్రం అనుమతించబోమని చెప్పారు. అది మానవ నైజానికి పూర్తిగా విరుద్ధమైన చర్య అని, క్రిస్టియానిటికి కూడా వ్యతిరేకమని చెప్పారు. మేం మతపెద్దలు చెప్పిన అంశాలకు కట్టుబడి ఉంటాం. మా నమ్మకాలు, విశ్వాసాలు కాపాడుకుంటాం. మా సమాజంలో స్వలింగ సంపర్కానికి అనుమతించం. అది మా సంస్కృతిని, సంప్రదాయాలను, మతాన్ని దెబ్బతీస్తుంది' అని ఆయన తెలిపారు.
ఇలాంటి చర్యలను వ్యతిరేకించే ఎలాంటి మతసంస్థకైనా.. ఇతర సంస్థలకైనా ప్రభుత్వం తరుపునా పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా గత వారంలో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తరుఫున అటార్నీ జనరల్, గేలు, లెస్బియన్ల తరుపున మరికొందరు కోర్టులో వాదనలు జరిపారు. అందరి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.