అనుమానితుల సమాచారం ఇవ్వండి
అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి
వాంబే గృహాల తనిఖీ
రికార్డులు లేని ద్విచక్ర వాహనాల గుర్తింపు
రాజమహేంద్రవరం సిటీ :
అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి సూచించారు. నేరాలను అదుపునకు ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలోని ఆర్యాపురం సమీపంలో ఉన్న ఆదెమ్మదిమ్మ వాంబే గృహాలను ఆదివారం ఆమె తనిఖీ చేశారు. సుమారు 200 మంది పోలీసులు, యాంటీ గూండా స్క్వాడ్‌తో ఈ కార్డన్ చెక్ నిర్వహించారు. ఆదెమ్మదిబ్బ వాంబేగృహాల కేంద్రంగా నగరంలో నేరాలు జరుతున్నాయనే అనుమానంతో తనిఖీలు చేపట్టారు. అక్కడి 1026 గృహాల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు పరిశీలించారు.
20 మోటారు సైకిళ్ల గుర్తింపు
ఈ తనిఖీల్లో ఏ విధమైన ఆధారాలు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించారు. నగరంలో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అదుపు చేసేందుకు ఈ తనిఖీ నిర్వహించినట్టు రాజకుమారి తెలిపారు. కాగా.. రాత్రి సమయాల్లో వాంబే గృహాల సమీపంలో కొందరు పేకాడుతున్నారని, అలాగే మత్తు ఇంజెక్షన్లు వాడుతున్నారని స్థానికులు మహిళలు.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు కులశేఖర్, ఇ¯Œæస్పెక్టర్లు రవీంద్ర, రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.