రోడ్ల అభివృద్ధికి రూ.186 కోట్లు మంజూరు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారుల అభివృద్ధి నిధులు రూ.1000 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో జిల్లాకు రూ.186 కోట్లు కేటాయించారు. జిల్లాలోని వివిధ రోడ్ల అభివృద్ధికి ఈ నిధుల కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.. యర్నగూడెం నుంచి పొంగుటూరు వరకు రోడ్ల విస్తరణ, పటిష్టత కోసం రూ.15 కోట్లు, తేతలి–మునిపల్లి రోడ్డులోని గోస్తనీ నది కాలువపైన, కాకరపర్రు కాలువపైన ఉన్నత స్థాయి వంతెనల నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయించారు. తేతలి–మునిపల్లి రోడ్డు విస్తరణ, పటిష్టత కోసం రూ.12 కోట్లు, గుండుగొలను, ఆగడాలలంక మీదుగా పెద్దింట్లమ్మ దేవస్థానం వరకూ రోడ్డును మెరుగుపరచడానికి రూ.25 కోట్లు, తణుకు–భీమవరం రహదారి విస్తరణ, పటిష్టతకు రూ.8 కోట్లు, నరసాపురం–తూర్పుతాళ్లు రోడ్డు విస్తరణకు రూ.12 కోట్లు, ఏలూరు–గుండుగొలను–కొవ్వూరు (ఈజీకే) రోడ్డు మెరుగుపరచడానికి రూ.12 కోట్లు, ఏలూరు–నూజివీడు రోడ్డు విస్తరణకు రూ.11 కోట్లు కేటాయించారు. సిద్ధాంతం–జుతి్తగ రోడ్డు విస్తరణకు రూ.10 కోట్లు, కొణితివాడ మీదుగా బుధారాయుడు చెరువు–రాయకుదురు రోడ్డును మెరుగుపరచడానికి రూ.6 కోట్లు, శృంగవృక్షం–బేతపూడి రోడ్డుకు రూ.7 కోట్లు, పెంటపాడు–వరదరాజపురం రోడ్డుకు రూ.12 కోట్లు, తాడేపల్లి–అనంతపల్లి రోడ్డుకు రూ.25 కోట్లు, తాడేపల్లిగూడెం–అప్పారావుపేట రోడ్డుకు రూ.12 కోట్లు, పాలకొల్లు–దొడ్డిపట్ల రోడ్డుకు రూ.9 కోట్లు కేటాయించారు.