గ్రామీణ రహదారులకు రూ.1,767 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులను పటిష్టం చేసేందుకు రూ.1,766.92 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణ రహదారుల స్థితిగతులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ నెల ఒకటి, ఏడు తేదీల్లో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టనున్న 3,426 పనులకుగాను రూ.1,766 కోట్లతో అంచ నాను రూపొందించారు. నెలఖారులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వచ్చే జూన్‌లోగా పనులను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.