Devender Singh
-
ముద్దు పెట్టిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష
నెవార్క్: విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నెవార్క్‌లోని జడ్జి స్టాన్లీ చెస్లర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేవేందర్ సింగ్ హ్యూస్టన్ నుంచి నెవార్క్‌కు యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే కూర్చున్న మహిళకు ముద్దు పెట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి దేవేందర్‌పై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేవేందర్ సింగ్‌కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఎన్నారై దేవేందర్ సింగ్ ల్యూసియానాలో నివసిస్తున్నాడు. -
విమానంలో ఓ ముద్దు... జైలు పాలు చేసింది !
న్యూయార్క్: ఆయన వయస్సు 62 ఏళ్లు... విమానంలో ప్రయాణిస్తూ... తన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా... ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి తోటి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన అమెరికాలో హ్యూస్టన్ నుంచి నెవార్క్‌కు యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెళ్తుండగా చోటు చేసుకుంది. నిందితుడి ఎన్నారై దేవేందర్ సింగ్‌గా గుర్తించామని... అతడి స్వస్థలం ల్యూసియానా అని చెప్పారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దేవేందర్ సింగ్‌కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 250,000 అమెరికన్ డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. నిందితుడు దేవేందర్ సింగ్‌ను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)