వీధుల్లో చేపల వేట
సాక్షి,హైదరాబాద్: భారీ వర్షాలతో జలమయమైన కాలనీల్లో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. శ్రీరామలింగేశ్వర కాలనీలో వరద నీటిలో కాంగ్రెస్‌నేతలు స్థానికులతో కలిసి చేపలు పట్టి నిరసన తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం కనీస చర్యలు తీసుకోలేదని మాజీ ఎంఎల్ఏ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. నగర ప్రజలు చెల్లిస్తున్న పన్నులను ఇతర అవసరాలకు వినియోగిస్తూ ప్రజా సమస్యలను విస్మరించారని ఆరోపించారు.