రూ.125 కోట్ల నల్లధనం అప్పగింత
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఒక న్యాయవాది తాను అక్రమంగా సంపాదించిన రూ.125 కోట్ల నల్లధనాన్ని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు అధీనపరిచాడు. న్యాయవాది, ఆయనకు చెందిన వ్యాపార సంస్థలు పన్ను ఎగ్గొట్టాయని సమాచారం రావడంతో కొన్ని రోజుల క్రితం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం అతను ఈ డబ్బును ఐటీ శాఖకు అప్పగించాడు.
స్వచ్ఛంద నల్లధనం వెల్లడి పథకాన్ని కూడా ఆయన ఉపయోగించుకోలేదు. మరో ఘటనలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో డీజీసీఈఐ (డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్) అధికారులు రూ.2,300 కోట్ల నల్లధనాన్ని గుర్తించారు.