'అక్కడైతే భారత్‌తో మ్యాచ్ ఆడరాదు'
ధర్మశాల: టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా ఈ నెల 19న ధర్మశాలలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆడరాదని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా ప్రకటన చేశారు. అతిథి మర్యాదలకు పూర్తిగా వ్యతిరేకం. విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మశాలలో పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుందని నేను భావించడం లేదు' అని ఇమ్రాన్ అన్నాడు.
ధర్మశాలలో భారత్, పాక్‌ల మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని హిమాచల్ సీఎం వీరభ్రద సింగ్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతేగాక పాక్‌తో మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడం పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిలో మరణించిన సైనికులను అవమానించడమేనని అన్నారు. ఈ నేపథ్యంలో ధర్మశాల మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. తాజా పరిస్థితిని అంచనా వేసేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన పాక్ బృందం హిమాచల్ సీఎం, డీజీపీలతో సమావేశమై చర్చించనుంది.