రైలు ఢీకొని వ్యక్తికి గాయాలు
ధర్మవరం(అనంతపురం జిల్లా): ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రైల్వేగేటు వద్ద బుధవారం రైలు ఢీకొని నర్సింహులు(45) అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నర్సింహులును ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.