dharmavaram right canal
-
ధర్మవరం కుడికాలువకు నీటి సరఫరా బంద్
కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు శనివారం నీటి సరఫరా బంద్ చేశారు. కుడి కాలువకు గత నెల 1న నీటిని విడుదల చేసిన విషయం విదితమే. డ్యాం డీఈ పక్కీరప్ప మాట్లాడుతూ కుడి కాలువకు నీటిని విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 2.565 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. రోజుకు 500 నుంచి 700 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా అయ్యిందన్నారు. 112 కిలో మీటర్ల దూరం ఉన్న ధర్మవరం కుడికాలువ కింద ఉన్న 49 చెరువులన్నింటికీ తాగునీటి సౌకర్యార్థం సుమారు 30 శాతానికి పైగానే నీటిని నింపినట్లు చెప్పారు. -
ధర్మవరం కుడికాలువకు నీరు విడుదల
కూడేరు : మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం కుడికాలువకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ నెల 1నే నీటిని విడుదల చేయగా... 5 రోజులు క్రితం ముకుందాపురం, రామచంద్రాపురం, ఆత్మకూరు మండలంలోని యాలేరు ప్రాంతాల వారు తమ ప్రాంతానికి నీటిని తీసుకెళ్ళేందుకు కుడికాలువకు గండ్లు కొట్టారు. గండ్ల మరమ్మత్తుల కోసం 4 రోజులు క్రితం నీటిని అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు పూర్తి కావడంతో మళ్ళీ నీటిని విడుదల చేశారు. ఈ నీరు డ్యాం నుంచి ధర్మవరం వరకు 112 కిలో మీటర్ల వరకు ప్రవహిస్తుంది.