ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణ
కడప(ఒంటిమిట్ట): వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే సీతారాముల కల్యాణోత్సవాన్ని బుధవారం ఉదయం 9.18 నిముషాలకు ధ్వజారోహణ చేశారు. ఇందులో భాగంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షించింది. ఈ నెల 10న స్వామి కల్యాణం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కల్యాణోత్సవానికి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 110 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది.